త్రిబుల్ ఇంజన్ గ్రోత్‌తో ఎన్డీఏ పాలన: మాధవ్
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:21 AM
అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్, త్రిబుల్ ఇంజన్ గ్రోత్‌తో ఎన్డీఏ పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నా రు. పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్, త్రిబుల్ ఇంజన్ గ్రోత్‌తో ఎన్డీఏ పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నా రు. పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘ప్రజలకు జనరంజకమైన పాలన అందించే పనిలో భాగంగా కూటమి ఐక్యత కాపాడుకోవాలి. విశాఖపట్నంలో జరుగుతున్న నేటి కార్యక్రమం నగర చరిత్రలో మర్చిపోలేని ఘటన. పేదలు ఉంటున్న నివాసం, స్థలం వారి సొంతమైంది. వారి కల సాకారమైంది. అందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపారు. 2014-19లో విశాఖలో 62 వేల మంది పేదలకు చంద్రబాబు పట్టాలు ఇవ్వగా, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్లు ఇవ్వలేదు. తిరిగి చంద్రబాబ సీఎంగా వచ్చిన తరువాత నగరంలో పేదలకు గతంలో ఇచ్చిన పట్టాలకు అనుగుణంగా ఇప్పుడు 23 వేల మందికి కన్వేయన్స్ డీడ్లు, కొత్తగా మరో ఐదు వేల మందికి పట్టాలు ఇస్తున్నారు’ అని మాధవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు