Share News

సుపరిపాలనను ఆశీర్వదించారు

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:33 AM

‘మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపుగా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం’ అని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ అన్నారు.

సుపరిపాలనను ఆశీర్వదించారు

  • మాపై మరింత పెద్ద బాధ్యత పెట్టారు: లోకేశ్‌

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపుగా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం’ అని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘సుపరిపానలకు ప్రజలు అందించిన ఆశీర్వాదంగా ఈ తీర్పును స్వీకరిస్తున్నాం. ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి.

ఇక అందరి దృష్టి ప్రజాసేవపైనే ఉండాలి. గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మన ముందున్న అసలైన బాధ్యత. ఈ తీర్పు మరింత వినయంతో, మరింత బాధ్యతతో పనిచేయాలనే సంకల్పాన్ని ఇచ్చింది. ప్రజాసేవ, రాష్ట్ర ప్రగతి... ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 01:34 AM