ప్రజాస్వామ్యం గురించి జగన్ నీతులు చెప్పడమా?: లోకేశ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:19 AM
ప్రజా ప్రభుత్వ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని మంత్రి లోకేశ్ చెప్పారు.
బెంగళూరు, అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని మంత్రి లోకేశ్ చెప్పారు. రాప్తాడు పాఠశాలలో రాక్షసుడి దాడిలో గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం స్థానిక ఎన్నికలపై మంత్రి మీడియాతో మాట్లాడారు. పులివెందులలో ఏకగ్రీవాలు జరిగాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలోని ప్రతి వార్డునూ ఏకగ్రీవం చేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి జగన్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పోలీస్ సెక్యూరిటీ కల్పించామన్నారు. పులివెందులలో నామినేషన్ వేసేవారిని ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు. గత రాత్రి వాహనాలను తగులబెట్టి, నిందను మాపై వేస్తున్నారని, ప్రజలపై వారే దాడి చేసి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వల్లే సమస్యలు వస్తున్నాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..
నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం