హేట్సాఫ్ రామ్మూర్తిగారూ! వృద్ధురాలైన తల్లి, దివ్యాంగురాలైన భార్య సేవలో వృద్ధుడు
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:10 AM
కోనసీమ అంబేడ్కర్ జిల్లాకు చెందిన ఆరు పదులు దాటిన వృద్ధుడు రామ్మూర్తి దయనీయ జీవనం వైరల్ అయింది. దీనిపై మంత్రి లోకేశ్ ఎక్స్‌లో స్పందించారు.
అమరావతి, (ఆంధ్రజ్యోతి): కోనసీమ అంబేడ్కర్ జిల్లాకు చెందిన ఆరు పదులు దాటిన వృద్ధుడు రామ్మూర్తి దయనీయ జీవనం వైరల్ అయింది. దానిపై మంత్రి లోకేశ్ ఎక్స్‌లో స్పందించారు.
‘వయోభారంతో బాధపడుతున్నప్పటికీ రామ్మూర్తి తన తల్లి, భార్యకు అందిస్తున్న సేవలు సమాజంలో కుటుంబ బంధాలకు ఆదర్శంగా నిలుస్తాయి. ఆయన చూపిస్తున్న బాధ్యత, ప్రేమ ప్రతి ఒక్కరినీ చలింపచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మట్టిలోని మానవత్వానికి, ఆత్మీయతకు రామ్మూర్తి జీవనశైలి నిలువెత్తు నిదర్శనం. ఆయన చూపిస్తున్న కరుణ, ధైర్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. రామ్మూర్తి గారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల సంక్షేమ ఫలాలు, లబ్ధి త్వరితగతిన అందేలా నేనే స్వయంగా బాధ్యత తీసుకుంటాను. హేట్సాఫ్ రామ్మూర్తిగారూ!’ అని లోకేశ్ పేర్కొన్నారు. తన స్పందనను కోనసీమ కలెక్టర్‌కు ట్యాగ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా..
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్