Share News

ఏపీఎల్‌లో ఓ క్రికెట్‌ జట్టును స్పాన్సర్‌ చేయండి

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:01 AM

అమరావతిలో స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు చేసి యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని ఆర్‌పీఎస్‌జీ గ్రూపును మంత్రి లోకేశ్‌ కోరారు.

ఏపీఎల్‌లో ఓ క్రికెట్‌ జట్టును స్పాన్సర్‌ చేయండి

  • ఆర్‌పీఎస్‌జీ గ్రూపు ఎండీ శాశ్వత్‌ గోయెంకాకు లోకేశ్‌ విజ్ఞప్తి

అమరావతిలో స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు చేసి యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని ఆర్‌పీఎస్‌జీ గ్రూపును మంత్రి లోకేశ్‌ కోరారు. సీఐఐ సమ్మిట్‌లో ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శాశ్వత్‌ గోయెంకాతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌లో స్థానికంగా ఒక జట్టుకు స్పాన్సర్‌ చేయాలని కోరారు. ఆర్‌పీఎస్‌జీ సంస్థ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ అయిన ఎఫ్‌ఎస్‌పీ డిజైన్‌ (దుస్తులు తయారీ, డిజైన్‌ కేంద్రం) సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలన్నారు.

విశాఖ లేదా తిరుపతిలో కొత్త ఐటీ కార్యాలయాలు ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. దీనిపై శాశ్వత్‌ గోయెంకా స్పందిస్తూ.. ఏపీలో ఇప్పటికే రూ. 3,286 కోట్ల పెట్టుబడితో 349.8 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 06:01 AM