Share News

కూటమి ప్రభుత్వ పురోగతిని తట్టుకోలేకే.. జగన్ డ్రామాలు: డూండీ రాకేశ్

ABN , Publish Date - Jun 18 , 2026 | 01:31 PM

కూటమి ప్రభుత్వ పురోగతిని తట్టుకోలేకనే వైఎస్ జగన్ వరుస ప్రెస్ మీట్లతో డ్రామాలు ఆడుతున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వ పురోగతిని తట్టుకోలేకే.. జగన్ డ్రామాలు: డూండీ రాకేశ్
Doondi Rakesh

అమరావతి, జూన్ 18: కూటమి ప్రభుత్వ పురోగతిని తట్టుకోలేకనే వైఎస్ జగన్ వరుస ప్రెస్ మీట్లతో డ్రామాలు ఆడుతున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ మండిపడ్డారు. గత ప్రభుత్వం జీవో నెం.117తో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తే, కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేసి సమూల మార్పులు తెచ్చిందన్నారు. శనివారాన్ని 'నో బ్యాగ్ డే'గా ప్రకటించిన ఘనత మంత్రి నారా లోకేశ్‌దేనని కొనియాడారు.


ఈ సందర్భంగా డూండీ రాకేశ్ మాట్లాడుతూ.. ‘గతంలో 'గొడ్డలి పార్టీ' మనుషులకే అమ్మఒడి ఇస్తే, నేడు ఇంట్లో ఎంతమంది ఉన్నా 'తల్లికి వందనం' వర్తింపజేస్తున్నారు. 'లీప్' కార్యక్రమంతో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందిస్తూ సీఎం, ఎమ్మెల్యేలే స్వయంగా వారితో కలిసి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరిగాయని, గతంలో టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది. డీఎస్సీ గురించి మాట్లాడితేనే కేసులు పెట్టిన జగన్, నేడు కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే విమర్శించడం సిగ్గనిపిస్తోంది’. అని అన్నారు.


ఇవి కూడా చదవండి...

ఈ-స్టాంప్‌ కేసు పురోగతిపై నివేదిక ఇవ్వండి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 01:37 PM