ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యం
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:15 AM
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు.
ఆర్టీఐహెచ్ ఏపీ స్టార్టప్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో మంత్రి లోకేశ్
విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు. సీఐఐ సదస్సులో భాగంగా రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్‌టీఐహెచ్) ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఏపీ స్టార్టప్ ఎక్స్ఛేంజ్(ఏపీఈఎస్) కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన ఆరు ప్రతిభావంతమైన స్టార్టప్‌ల నిర్వాహకులను సత్కరించారు.
అనంతరం ఏపీ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ-2024 కింద తొలివిడతగా రూ.2.11 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్రానికి చెందిన 31 స్టార్టప్‌లకు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25 విభిన్న పారిశ్రామిక ఎకో సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రతన్‌టాటా స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ఎం.సూర్యతేజ పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్