తెలుగు ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Aug 15 , 2026 | 09:52 AM
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరి మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు..
అమరావతి, ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడం వెనుక ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, నిరంతర కృషి దాగి ఉన్నాయి. దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ, ప్రజాస్వామ్య విలువలను అనుభవిస్తూ ముందుకు సాగుతున్నాం అని అన్నారు.
స్వాతంత్య్రం అనేది కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన రోజును గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు.. దేశం కోసం మన బాధ్యతలను గుర్తించుకునే సందర్భం అన్నారు. దేశాన్ని మరింత బలమైన, అభివృద్ధి చెందిన, సమగ్ర, సుసంపన్నమైన దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించడమే.. సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అని చెప్పారు. యువతలో దేశభక్తి, బాధ్యత, సేవాభావం, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందిస్తూ భవిష్యత్ తరాలకు మెరుగైన భారతదేశాన్ని అందించేందుకు మనమంతా కృషి చేయాలి లోకేశ్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ముంబై రైలా మజాకా.. కొరియా వ్యక్తికి చుక్కలు కనిపించాయిగా..
ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. రైలు ఎక్కుతుండగా..