Share News

అట్టహాసంగా నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక

ABN , Publish Date - Mar 14 , 2026 | 09:05 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.

అట్టహాసంగా నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక
nara devansh dhoti ceremony

హైదరాబాద్, ఫిబ్రవరి 14: నారా, నందమూరి కుటుంబాల్లో ఇవాళ సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ (ధోతీ వేడుక) శనివారం అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్‌లోని నివాసంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.

తాతల మురిపెం.. అమ్మానాన్నల ప్రేమ

ఈ వేడుకలో దేవాన్ష్‌ను చూసి తాతలు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ మురిసిపోయారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో దేవాన్ష్‌కు నూతన వస్త్రాలను బహుకరించి, ఆశీర్వదించారు. అమ్మమ్మ వసుంధర, నాన్నమ్మ భువనేశ్వరిల ఆశీస్సులు, మేనమామల ఆత్మీయత మధ్య ఈ వేడుక ఉత్సాహంగా సాగింది.


సాధారణంగా.. శాస్త్రీయంగా..

ఆడంబరాలకు పోకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. దేవాన్ష్ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగించాలని ఆకాంక్షిస్తూ పెద్దలందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు.

సోషల్ మీడియాలో వైరల్

నారా వారసుడి ధోతీ వేడుకకు సంబంధించిన వార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, రాజకీయ ప్రముఖులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దేవాన్ష్ ఎంతో హుందాగా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం

సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

Updated Date - Mar 14 , 2026 | 09:05 PM