Share News

మైహోం సిమెంట్‌ ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:17 AM

రాష్ట్రంలో భారీ పెట్టుబడికి ప్రముఖ సంస్థ మై హోం ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడులో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపిన ఈ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మైహోం సిమెంట్‌ ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు

  • మూలధన పెట్టుబడిలో 39 శాతం సబ్సిడీ

  • పదేళ్లు యూనిట్‌ కరెంట్‌ రూపాయికే

  • పల్నాడు జిల్లాలో 3 వేల కోట్లతో ఈ ఫ్యాక్టరీ

  • 3 వేల మందికి ఉపాధి అవకాశాలు

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ పెట్టుబడికి ప్రముఖ సంస్థ మై హోం ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడులో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపిన ఈ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో ఏటా 3.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ ఫ్యాక్టరీని మైహోం ఏర్పాటు చేస్తుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 2029 మార్చి నాటికి పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం.. మూలధన పెట్టుబడిలో 39 శాతం.. గరిష్ఠంగా రూ.943.02 కోట్ల క్యాపిటల్‌ సబ్సిడీ ఇవ్వనున్నారు. దీనిని వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి 10 ఏళ్లపాటు ఇస్తారు. విద్యుత్‌ యూనిట్‌ను రూ.1కే పదేళ్లపాటు సరఫరా చేస్తారు. ఈ రాయితీలో గరిష్ఠంగా రూ186.34 కోట్లు వరకు రీయింబర్స్‌ చేస్తారు. 2 వేల మందికి ఉపాధి కల్పిస్తే అదనంగా మరో 2 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. ఈ ఫ్యాక్టరీ కోసం 271.9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ ద్వారా కేటాయిస్తారు.


మేఘా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు రద్దు

అన్నమయ్య జిల్లాలో మేఘా సంస్థకు కేటాయించిన 2వేల మెగావాట్ల కొమ్మూరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టును రద్దు చేస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థకు కేటాయించిన ప్రాంతం.. నాగార్జునసాగర్‌- శ్రీశైలం పులుల అభయారణ్యాన్ని శేషాచలం కొండలతో కలిపే ప్రతిపాదిత పులుల కారిడార్‌ పరిధిలో ఉండడం, శ్రీపెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని ఎకో-సెన్సిటివ్‌ జోన్‌లో ఉండడంతో ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని పేర్కొంటూ ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:17 AM