ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో పరిషత్ ఎన్నికలు వాయిదా
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:12 AM
తుఫాను ప్రభావంతో ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది.
6న ఎన్నికలు నిర్వహిస్తాం: ఎస్‌ఈసీ
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): తుఫాను ప్రభావంతో ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది. ఏలూరు జిల్లాలో నాలుగు మండలాల్లోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతోపాటు మరో మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన మొత్తం 64 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 6వ తేదీకి మార్చింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్రపునేఠా బుధవారం నోటిఫికేషన్ జారీచేశారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో, కొయ్యలగూడెం మండలం అచ్చుతాపురంలోని 31,32 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 6న పోలింగ్ నిర్వహిస్తారు. 7న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్