పీ4కు ప్రోత్సాహం ప్రశంసనీయం: కలిశెట్టి
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:01 AM
విశాఖ వేదికగా రెండు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు అద్భుతమైన విజయాన్ని సాధించింది.
అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘విశాఖ వేదికగా రెండు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు అద్భుతమైన విజయాన్ని సాధించింది. రాష్ట్రాభివృద్ధిలో ఇది ఒక గొప్ప శుభపరిణామం’ అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో అట్టడుగు స్థాయికి వెళ్లిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సీఎం విజన్‌కు మంత్రి లోకేశ్ చురుకైన కార్యాచరణ తోడవడంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తరలివస్తున్నారు. కేవలం వ్యాపార ఒప్పందాలకే పరిమితం కాకుండా ఈ సదస్సు ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం చంద్రబాబు పీ4 విధానాన్ని ప్రోత్సహించడం చరిత్రాత్మకం’ అని కలిశెట్టి అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం