పులివెందులలో జగన్ తీరు హేయం
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:10 AM
‘పులివెందుల పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే వైఎస్ జగన్ మాట్లాడిన తీరు అత్యంత హేయం. ఒక మాజీ సీఎం మాట్లాడాల్సిన భాష కాదు’ అని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీధి రౌడీలా మాట్లాడిన మాజీ సీఎం: యరపతినేని
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘పులివెందుల పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే వైఎస్ జగన్ మాట్లాడిన తీరు అత్యంత హేయం. ఒక మాజీ సీఎం మాట్లాడాల్సిన భాష కాదు’ అని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన మాటలు వీధి రౌడీ భాషను తలపించాయంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన మాట్లాడారు. ‘చొక్కాలు మడిచి... బజార్లోకి రండి, తిరగబడండి, రాబోయే ఎన్నికల తర్వాత జగన్ 2.0 పాలన చూపిస్తా అంటూ మాట్లాడటం ఆయన పగటి కలలకు నిదర్శనం. పులివెందులలో కూడా పార్టీ పరిస్థితి దిగజారిందనే విషయం అర్థమయ్యే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.’ అని యరపతినేని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట