Share News

అపర భగీరథుడు చంద్రబాబు: ఎమ్మెల్యే మాధవి

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:44 AM

ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలను కోనసీమగా మార్చగల నాయకుడు, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, అపర భగీరథుడు సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే మాధవి కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నూరుశాతం పూర్తిచేసి జిల్లాలోనే తొలిస్థానంలో నిలిపిన టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు ఆమె వెలిగొండ, శ్రీశైలం పర్యటన చేపట్టారు.

అపర భగీరథుడు చంద్రబాబు: ఎమ్మెల్యే మాధవి

  • 450 మంది కార్యకర్తలతో కలిసి వెలిగొండ, శ్రీశైలం పర్యటన

  • ‘ఇంటింటి ప్రచారం’ నూరు శాతం పూర్తి చేసినందుకు ప్రోత్సాహకం

గుంటూరు/పెద్దదోర్నాల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలను కోనసీమగా మార్చగల నాయకుడు, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, అపర భగీరథుడు సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే మాధవి కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నూరుశాతం పూర్తిచేసి జిల్లాలోనే తొలిస్థానంలో నిలిపిన టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు ఆమె వెలిగొండ, శ్రీశైలం పర్యటన చేపట్టారు. ఆదివారం తమ సొంత ఖర్చులతో 10 బస్సులు, 6 కార్లలో మొత్తం 450 మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి బయలుదేరారు. పర్యటనలో భాగంగా వారంతా తొలుత మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు సొరంగాల నుంచి బయటకు వస్తున్న కృష్ణా జలాలను సందర్శించారు. అనంతరం ఫీడర్‌ కెనాల్‌లో లాకుల వద్ద ప్రవహిస్తున్న నీటిలో పూలు సమర్పించి నమస్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన టన్నెల్‌, నీటి ప్రవాహ మార్గాలు, ఫీడర్‌ కాలువలు, 40 కి.మీ. ప్రధాన కాలువతో పాటు ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను కార్యకర్తలతో కలిసి ఆమె వీక్షించారు. అనంతరం శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ వెలిగొండ కేవలం ఒక నీటి పారుదల ప్రాజెక్టు మాత్రమే కాదని, అది చంద్రబాబు దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావానికి ప్రతీక అని కొనియాడారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 30కి పైగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 03:44 AM