Share News

పరిషత్‌ ఎన్నికల్లోనూ స్వీప్‌ చేస్తాం: సవిత

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:39 AM

‘శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మునిసిపాలిటీ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. కూటమి అభ్యర్థులను గెలిపించారు’ అని మంత్రి సవిత అన్నారు.

పరిషత్‌ ఎన్నికల్లోనూ స్వీప్‌ చేస్తాం: సవిత

పెనుకొండ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మునిసిపాలిటీ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. కూటమి అభ్యర్థులను గెలిపించారు’ అని మంత్రి సవిత అన్నారు. పెనుకొండలో మంగళవారం మాట్లాడారు. ‘చొక్కా మడతపెడతానని చెప్పిన జగన్‌ను మడతపెట్టి పక్కన పడేశారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. పరిషత్‌ ఎన్నికల్లో కూడా వైసీపీకి పుట్టగతులు లేకుండా పోతాయి. ఎన్డీఏ కూటమి క్లీన్‌స్వీ్‌ప్ చేస్తుంది’ అని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 01:39 AM