ఎంపీ మిథున్‌రెడ్డి ఓ రౌడీ: మంత్రి సవిత
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:53 AM
పుంగనూరు ఎంపీ మిథున్‌రెడ్డి రౌడీలా వ్యవహరిస్తున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
పెనుకొండ టౌన్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పుంగనూరు ఎంపీ మిథున్‌రెడ్డి రౌడీలా వ్యవహరిస్తున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎంపీ మిథున్‌రెడ్డి ఓ రౌడీ. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. గొడ్డలి పార్టీకి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడి గే నైతిక విలువల్లేవు. ఓటమి భయంతోనే జగన్, గొడ్డలి పార్టీ నాయకులు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి దాడులకు తెగబడటం దారుణం. భయపడేది లేదు. పులివెందుల సహా అన్నిచోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో గొడ్డలిపార్టీ క్లోజ్ కావడం ఖాయం.
జగన్‌పై ఈడీ వరుస దాడులు, వివేకా హత్యకేసులో వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలె్సవైపు చూపుతుండటంతో ప్యాలెస్ పెద్దలు విలవిలలాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే... జగన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారు’ అని మంత్రి మండిపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ