వైసీపీకి ప్రజలు సమాధి కట్టారు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:05 AM
‘నరకాసుర వధతో దీపావళి పండుగను జరుపుకున్నట్టు, స్థానిక సంస్థల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి బ్రహ్మరథం పట్టారు. గొడ్డలి పార్టీ అరాచక పాలనకు సమాధి కట్టారు’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పాలకొల్లు అర్బన్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘నరకాసుర వధతో దీపావళి పండుగను జరుపుకున్నట్టు, స్థానిక సంస్థల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి బ్రహ్మరథం పట్టారు. గొడ్డలి పార్టీ అరాచక పాలనకు సమాధి కట్టారు’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వైసీపీ అరాచకాలు, అకృత్యాలకు ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఓటుతో గట్టిగా సమాధానం చెప్పారు.
కూటమి రెండేళ్ల పాలనలో చేసిన సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గుండెల్లో పెట్టుకుని మరింత బాధ్యతగా పనిచేస్తాం. వైసీపీ తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకుంది. రప్పా, రప్పా... హింసాత్మక రాజకీయాలు, విష సంస్కృతిని ప్రోత్సహించే వైసీపీకి ప్రజలు శాశ్వతంగా సమాధి కట్టారు’ అని నిమ్మల వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి: