బహుళ అంతస్తుల భవన అనుమతులు ఇవ్వండి: నారాయణ
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:19 AM
బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం దాఖలైన పెండింగ్ దరఖాస్తులపై మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు.
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం దాఖలైన పెండింగ్ దరఖాస్తులపై మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ కారణాలతో అనుమతులు నిలిచిపోయిన దరఖాస్తులపై టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లతతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం సమీక్షించారు. అనుమతుల జారీలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెద్దగా ఇబ్బందులు లేని దరఖాస్తులను పరిశీలించి గురువారంలోగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’