గల్లా వారి విందులో లోకేశ్!
ABN , Publish Date - Nov 30 , 2026 | 02:12 AM
అమర రాజా గ్రూపు సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్, పద్మావతి దంపతుల కుమారుడు గల్లా సిద్ధార్థ్, దక్షిణ కొరియాకు చెందిన హెయిన్‌కిమ్ దంపతులను మంత్రి లోకేశ్ ఆశీర్వదించారు
నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి
తిరుపతి(టీటీడీ), నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అమర రాజా గ్రూపు సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్, పద్మావతి దంపతుల కుమారుడు గల్లా సిద్ధార్థ్, దక్షిణ కొరియాకు చెందిన హెయిన్‌కిమ్ దంపతులను మంత్రి లోకేశ్ ఆశీర్వదించారు. గల్లా సిద్ధార్థ్, హెయిన్‌కిమ్‌ల వివాహం ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు వియత్నాంలోని హుక్కాక్ ద్వీపంలో నిర్వహించారు. వివాహం అనంతరం ఆదివారం తిరుపతిలోని అమరరాజా ఆడిటోరియంలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ హాజరవ్వగా గల్లా రామచంద్రనాయుడు, గల్లా జయదేవ్ ఆయనకు సాదర స్వాగతం పలికి వేదిక మీదకు తీసుకెళ్లారు. నూతన దంపతులను పలకరించిన లోకేశ్ వారిని ఆశీర్వదించారు. తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. అంతకుముందు అక్కడే ఉన్న కార్యకర్తలను, రిసెప్షన్‌కు హాజరైన పలువురిని ఆప్యాయంగా పలకరించారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!