Share News

గురువులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టం

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:14 AM

‘అందరూ దైవంలా భావించే గురువులను వైన్‌ షాపులకు కాపలా పెట్టిన జగన్‌ ఉపాధ్యాయులను గౌరవిస్తారని అనుకోవడం భ్రమ’ అని మంత్రి లోకేశ్‌ అన్నారు. వైసీపీ గూండాలు ఉపాధ్యాయులపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

గురువులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టం

  • వైసీపీ ప్రేరేపిత రౌడీషీటర్ల పనిపడతాం: లోకేశ్‌

అమరావతి, మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘అందరూ దైవంలా భావించే గురువులను వైన్‌ షాపులకు కాపలా పెట్టిన జగన్‌ ఉపాధ్యాయులను గౌరవిస్తారని అనుకోవడం భ్రమ’ అని మంత్రి లోకేశ్‌ అన్నారు. వైసీపీ గూండాలు ఉపాధ్యాయులపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘అత్యుత్తమ ఆటతీరుతో మన రాష్ట్రం, మన దేశం సత్తా ప్రపంచానికి చాటిన క్రీడాకారులు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందితే... వారంతా ఫేక్‌ అని ఆరోపణలు చేసినప్పుడే జగన్‌ దుర్బుద్ధి బయటపడింది. జగన్‌ ఫేక్‌ ముఠా చేసిన తప్పుడు ఆరోపణలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్‌ కార్యాలయం వద్ద అధికారులను కలిశారు. క్రీడలతో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్‌ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్‌ ముఠా శాప్‌ కార్యాలయం వద్ద దాడికి దిగింది. రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్‌ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్‌ నేర మనస్తత్వాన్ని బయటపెట్టింది. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్‌ క్రిమినల్‌ గ్యాంగులను వదిలే ప్రసక్తే లేదు. టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలి. వైసీపీ ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్‌ బ్యాచుల పనిపడతాం’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 05:14 AM