Share News

గురజాడ సాహితీ సంపదను భావితరాలకు అందించాలి: మంత్రి కొండపల్లి

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:06 AM

నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు సాహిత్యం శాశ్వతంగా నిలిచిపోతుందని, ఈ సాహితీ సంపదను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

గురజాడ సాహితీ సంపదను భావితరాలకు అందించాలి: మంత్రి కొండపల్లి

  • ఘనంగా మహాకవి 164వ జయంతి

విజయనగరం, సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి): నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు సాహిత్యం శాశ్వతంగా నిలిచిపోతుందని, ఈ సాహితీ సంపదను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురజాడ జయంతిని ప్రభుత్వ ఉత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈనేపథ్యంలో విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం జరిగిన గురజాడ 164వ జయంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ... గురజాడ వారి విలువైన సాహిత్యాన్ని సంరక్షించుకుంటూ భావితరాలకు అందించాలని కోరారు. గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన సభలో గురజాడ కుటుంబ సభ్యులను సత్కరించారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 05:06 AM