Share News

వైద్య పరిశోధనకు ఆశ్రంతో ఎయిమ్స్‌ భాగస్వామ్యం

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:04 AM

రాష్ట్రంలో వైద్య పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఏలూరులోని ఏస్ఆర్‌ఏఎం

వైద్య పరిశోధనకు ఆశ్రంతో ఎయిమ్స్‌ భాగస్వామ్యం

  • మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ శాంతా సింగ్‌

విజయవాడ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఏలూరులోని ఏస్ఆర్‌ఏఎం (ఆశ్రం- అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) కాలేజీతో మంగళగిరి ఎయిమ్స్‌ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ఒక హోటల్‌లో శనివారం ఈ అవగాహన ఒప్పందం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అహంతెం శాంతా సింగ్‌ మాట్లాడుతూ, వైద్య విద్య, పరిశోధన, వైద్య నైపుణ్యాల అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలక ముందడుగు కానుందని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా వైద్య విద్యార్థులకు ఉన్నతస్థాయి పరిశోధన అవకాశాలు కల్పించడంతో పాటు పీహెచ్‌డీ పరిశోధనలకు సహకారం అందుతుందని వెల్లడించారు.

కార్యక్రమంలో ఏఎ్‌సఆర్‌ఏఎం ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ గోకరాజు గంగరాజు, డైరెక్టర్‌ డాక్టర్‌ గోకరాజు రతిదేవి, సీఈఓ డాక్టర్‌. కె.హనుమంతరావు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దాసరి వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 04:04 AM