ఎయిమ్స్‌లో ఫార్మసీ సేవల విస్తరణ
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:42 AM
రోగుల రద్దీ, మందుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి ఎయిమ్స్ ఫార్మసీ సేవలను మరింత విస్తరించింది. జన ఔషధి కేంద్రంలో ఏడు కౌంటర్లు, అమృత్ ఫార్మసీలో 14 కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మంగళగిరి సిటీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రోగుల రద్దీ, మందుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి ఎయిమ్స్ ఫార్మసీ సేవలను మరింత విస్తరించింది. జన ఔషధి కేంద్రంలో ఏడు కౌంటర్లు, అమృత్ ఫార్మసీలో 14 కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓపీడీ బ్లాక్ ఎదురుగా ఏర్పాటు చేసిన నూతన ఫార్మసీ బ్లాక్‌ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ అహంతెం శాంతాసింగ్ శుక్రవారం ప్రారంభించారు. నూతన కౌంటర్లు అందుబాటులోకి రావడంతో మందుల కోసం రోగులు, వారి సహాయకులు ఎదుర్కొనే రద్దీ, నిరీక్షణ సమయం తగ్గే అవకాశం వుంది. అలాగే జన ఔషధి, అమృత్ ఫార్మసీల ద్వారా తక్కువ ధరకే మందులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ