ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:37 AM
ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడుకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
30న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడుకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తూర్పు గాలులు తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమలపైకి వీస్తున్నాయి. దీంతో గురువారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, శుక్రవారం నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 30వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని, ఇది బలపడి వచ్చే నెల రెండో తేదీనాటికి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా