Share News

13న అల్పపీడనం

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:17 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి.

13న అల్పపీడనం

వాయుగుండం/తుఫాన్‌గా మారే చాన్స్‌

విశాఖపట్నం, విజయవాడ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఈనెల 18 లేదా 19వ తేదీకల్లా ఉత్తర తమిళనాడు తీరానికి చేరువగా వస్తుందని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని మరికొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి.

దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం పొడి వాతావరణం నెలకొంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం మంచు కురిసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉదయం పూట మంచు కురుస్తుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద

ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 3163 క్యూసెక్కుల నీరు వస్తుండగా, బ్యారేజీ రెండు గేట్లను అడుగు మేర ఎత్తి 1450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వజినేపల్లి నుంచి 909, పాలేరు నుంచి 151, కీసర నుంచి 2391 క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి వస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:18 AM