Share News

807 మద్యం షాపులకు లాటరీ

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:51 AM

రెన్యువల్‌ కాకుండా మిగిలిపోయిన 807 మద్యం షాపులకు లాటరీ నిర్వహించేందుకు ఎక్సైజ్‌ అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీచేశారు. వచ్చే నెల 1వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు దరఖాస్తుల దాఖలుకు గడువు ఉంటుంది. 3వ తేదీన దరఖాస్తులు పరిశీలిస్తారు.

807 మద్యం షాపులకు లాటరీ

  • నోటిఫికేషన్లు జారీచేసిన ఎక్సైజ్‌

  • దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు

  • వచ్చే నెల 5న లాటరీ ప్రక్రియ

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రెన్యువల్‌ కాకుండా మిగిలిపోయిన 807 మద్యం షాపులకు లాటరీ నిర్వహించేందుకు ఎక్సైజ్‌ అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీచేశారు. వచ్చే నెల 1వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు దరఖాస్తుల దాఖలుకు గడువు ఉంటుంది. 3వ తేదీన దరఖాస్తులు పరిశీలిస్తారు. 5న లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేస్తారు. 21వ సంవత్సరాలు నిండిన వ్యక్తులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని దరఖాస్తులైనా సమర్పించవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, హైబ్రిడ్‌ మూడు విధానాల్లో దరఖాస్తు చేసుకోవ్చని తెలిపింది. http://oc.hpfsproject.com, http://gk.hpfsproject.com వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తులు చేయాలని సూచించింది. దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.వెయ్యి చెల్లించాలని తెలిపింది. ఒక్కో షాపునకు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారని, లేనిపక్షంలో ఆ షాపులకు లాటరీ తీయకుండా దరఖాస్తు రుసుము తిరిగి చెల్లిస్తారని వివరించింది. లాటరీ ద్వారా ఎంపికైన లైసెన్సీలు పర్మిట్‌ రూమ్‌ లైసెన్స్‌ పొందాలని, ఒకేసారి లేదా నాలుగు విడతల్లో రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ చెల్లించాలని స్పష్టం చేసింది. ఓపెన్‌ కేటగిరీలో 799 షాపులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 8 షాపులకు లాటరీ తీయనున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:51 AM