నైపుణ్యం, సృజనాత్మకతకు ప్రతీక విశ్వకర్మ: లోకేశ్
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:34 AM
నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రతీకగా నిలుస్తారని మంత్రి లోకేశ్ అన్నారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా గురువారం విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మంగళగిరి సిటీ, విజయవాడ అర్బన్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రతీకగా నిలుస్తారని మంత్రి లోకేశ్ అన్నారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా గురువారం విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
త్వరలో ఆదరణ-3: కమ్మరి పార్వతి
విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, సమగ్ర ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతి చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం విరాట్ విశ్వకర్మ భగవాన్ రాష్ట్రస్థాయి జయంత్యుత్సవం నిర్వహించారు. దేవశిల్పి విరాట్ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం త్వరలోనే ‘ఆదరణ-3’ పథకాన్ని పునఃప్రారంభించి, ఆధునిక పనిముట్లను అందించనుందన్నారు. విశ్వబ్రాహ్మణ వృత్తిదారులకు 50 ఏళ్లకే పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని, సానుకూల నిర్ణయం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి: