Share News

ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:20 AM

మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో గురువారం అంత్యక్రియలు జరిగాయి. అశేష జనవాహిని అశ్రునయనాల నడుమ ఏలూరు శ్రీరామనగర్‌లో ఆయన నివాసం వెనుక ఖాళీ స్థలంలో పెద్ద కుమారుడు మణిచంద్ర తలకొరివి పెట్టారు.

ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు

  • నాని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లోకేశ్‌

ఏలూరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో గురువారం అంత్యక్రియలు జరిగాయి. అశేష జనవాహిని అశ్రునయనాల నడుమ ఏలూరు శ్రీరామనగర్‌లో ఆయన నివాసం వెనుక ఖాళీ స్థలంలో పెద్ద కుమారుడు మణిచంద్ర తలకొరివి పెట్టారు. నాని పార్థివ దేహాన్ని మంత్రి లోకేశ్‌ శ్రద్ధాంజలి ఘటించారు. నాని భార్య రేఖ, కుమారులు మణిచంద్ర, ఆశి్‌షలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘వివాదరహితుడిగా, రాజకీయాల్లో హూందాతనానికి ప్రతీకగా, నిబద్ధతతో పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నాని నిలిచారు. ఆయన లేని లోటు పార్టీకి తీరనిది.

నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎంతో హూందాగా సమస్యలపై సూటిగా మాట్లాడేవారు. కొవిడ్‌ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నతమైన సేవలందించారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌, మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్‌ కుమార్‌, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, వైసీపీ నాయకులు తలశిల రఘురామ్‌, మామిళ్లపల్లి జయప్రకాశ్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ, ఎస్పీ కిశోర్‌, ఏలూరు ఆర్డీవో లక్ష్మీప్రసన్న నానికి నివాళులర్పించారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 05:20 AM