సీఈసీ జ్ఞానేశ్వర్‌ను తొలగించాలి వామపక్షాల డిమాండ్
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:07 AM
‘సర్’ పేరుతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని వామపక్ష పార్టీల నేలు ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘సర్’ పేరుతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని వామపక్ష పార్టీల నేలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో 10 వామపక్ష పార్టీల నాయకులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమొక్రసీ నాయకుడు పోలారి, ఎంసీపీఐ(యూ) నాయకుడు ఖాదర్‌బాషా మీడియాతో మాట్లాడారు. జ్ఞానేశ్వర్‌ను తొలగించాలనే డిమాండ్‌తో ఈనెల 26 నుంచి అక్టోబరు 2 వరకు వారం రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఈనెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూత్ ఫర్ డెమొక్రసీ పేరుతో యువత నిరసనలు చేపడతారని వారు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ