వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:26 AM
వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
పాములపాడు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మండలంలోని మిట్టకందాల గ్రామంలో బుధవారం తహసీల్దార్ సుభద్రమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీభూమి మీహక్కులో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గొడ్డలి పార్టీ అయిన వైసీపీ పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రఘురామిరెడ్డి, భీమ్‌శేఖర్, తిమ్మారెడ్డి, సొసైటీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, చెల్లె హరినాథరెడ్డి, సురేశ్, స్వాములు, బతుకలయ్య మల్లీశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం
కొత్తపల్లి: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మండలంలోని వీఆరాపురం గ్రామంలో మండల కన్వీనర్ లింగస్వామి గౌడు, క్లస్టర్ ఇన్‌చార్జి నారపురెడ్డి, స్థానిక టీడీపీ సర్పంచ్ బోరెడ్డి సరస్వతి, గ్రామ టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి, మండల అధికారులు, నాయకులతో కలిసి రెండేళ్ల ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ది కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తహసీల్దార్ ఉమారాణి, డిప్యూటీ ఎంపీడీవో సుబ్బారావు, ఏఈలు మద్దిలేటి, జుబేర్, అమీరున్నిసా భేగం, అబీద్, ఏపీవో విమలమ్మ, ఎంఈవో నాగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.