ప్రగతి పథంలో రాష్ట్రం
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:15 AM
రాష్ట్రం ప్రగతి పథకంలో పయనిస్తోందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పిలుపునిచ్చారు.
కల్లూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ప్రగతి పథకంలో పయనిస్తోందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని మాధవీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల, కల్లూరు, కల్లూరు అర్బన్ 16 వార్డుల టీడీపీ నాయకుతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఈనెల 27 నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ప్రతి ఇంటికీ చేరవేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ను ప్రకటించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, టీడీపీ నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జ్ గౌరు వెంకటరెడ్డి, యువ నాయకుడు గౌరు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.