ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: ఎమ్మెల్యే పార్థసారధి
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:08 AM
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగడం వల్లే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి అన్నారు.
ఆదోని, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు తెలుసుకుంటూ హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగడం వల్లే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి అన్నారు. ప్రజల కోసం పార్థసారధి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఆదోని పట్టణంలోని క్రాంతినగర్‌లో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. క్రాంతినగర్ పర్యటనలో కాలనీవాసులు పెన్షన్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు విద్యుత్ స్తంభాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. క్రాంతినగర్ గడ్డలో ఉన్న పార్కును అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునిస్వామి, ఉరుకుందగౌడ్, మాబాషా, సాయిప్రసాద్ వాల్మీకి, టీడీపీ నాయకులు రవి, జనసేన నాయకులు ఉరుకుంద, ఈరన్నస్వామి దేవాలయం డైరెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు.