Share News

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:15 AM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే
ఎమ్మెల్యేతో దేవస్థానం అధికారులు

శ్రీశైలం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు. గురువారం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ పర్యవేక్షకుడు హర్యానాయక్‌ వేదపండితులతో తిలకధారణ చేయించి పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. స్వామికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్న మంత్రి ప్రాకారంలోని పరివార దేవతాలయాలను కూడా దర్శించుకున్నారు. అనంతరం ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన వేద పండితులు తీర్థప్రసాదాలు ఇవ్వగా లడ్డూ ప్రసాదాలు, పరిమళ విభూది, శేషవస్త్రాలు, ఙ్ఞాపికను ఈవో అందజేశారు.

Updated Date - Apr 10 , 2026 | 12:15 AM