పదో తరగతి విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక విందు..
ABN , Publish Date - May 17 , 2026 | 05:42 PM
కర్నూలు నియోజకవర్గంలో పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక విందు ఇచ్చారు. టాప్-5లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.
కర్నూలు: నియోజకవర్గంలో పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక విందు ఇచ్చారు. టాప్-5లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. కర్నూలులోని తన ఇంటికి వారిని ఈరోజు (ఆదివారం) లంచ్‌కు ఆహ్వానించారు మంత్రి టీజీ భరత్. ఈ సందర్భంగా పిక్కిలి లిఖిత (593), పింజరి గిరీష (591), మీసాల మేఘన (587), గాజుల రోహిత (582), కురువ మల్లికార్జున (581)ను అభినందించారు. వారి కుటుంబ నేపథ్యం సహా బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
భవిష్యత్తులోనూ ఇదే విధంగా కష్టపడి చదవాలని, మంచి మార్కులు సాధించాలని మంత్రి భరత్ సూచించారు. మంత్రి నారా లోకేశ్ ఎంతో కృషి చేస్తూ విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. లోకేశ్ ఆలోచనా విధానం వల్లే విద్యార్థులు మంచి మార్కులు సాధించారని టీజీ భరత్ చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి తమను ఇంటికి పిలవడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. టీజీ భరత్‌తో కలిసి భోజనం చేయడంపై ఉప్పొంగిపోయారు. ఉన్నత చదువుల్లోనూ ఇలాగే కష్టపడి చదివి తల్లిదండ్రులకు, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని మంత్రి భరత్‌కు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే లక్ష్యం: మంత్రి గొట్టిపాటి
నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ ‘డైనో డీట్స్’ ప్రారంభం.. స్పందించిన లోకేశ్