వైసీపీ నేతలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:46 PM
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
నంద్యాల జిల్లా: బనగానపల్లెలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. బనగానపల్లె.. బ్రహ్మంగారు నడయాడిన పవిత్ర ప్రాంతమని పేర్కొన్న ఆయన, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కంటే అరాచక పాలనే ఎక్కువగా కనిపించిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని మంత్రి విమర్శించారు. ఐదేళ్లలో రాయలసీమ కోసం వైసీపీ నేతలు ఏం చేశారో, తాము ఏం చేశామో ప్రజల సమక్షంలో చర్చకు రావాలని సవాల్ చేశారు.
బనగానపల్లె బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తే, వైసీపీ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మళ్లీ తమ ప్రభుత్వం ఆ పనులను వేగవంతం చేసి బైపాస్ రోడ్డు నిర్మాణంలో 70 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే బనగానపల్లెలో 41 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేశారని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read:
కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సింగరేణి బకాయిలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్