కర్నూలులో జగన్ పర్యటన.. పోలీసుల ఆంక్షలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:08 AM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం కర్నూలులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు.
కర్నూలు, ఆగస్టు 13: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం కర్నూలులో పర్యటించనున్నారు. స్థానిక జైలులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన కలవనున్నారు. అనంతరం విరూపాక్షి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ ఎస్పీ కీలక ప్రకటన చేశారు. ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉందన్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. జగన్ కాన్వాయ్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని అన్నారు. ఈ కాన్వాయ్‌కు బందోబస్తు ఇస్తామన్న తెలిపారు.
ర్యాలీకి అనుమతి లేదని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ములాఖత్ ఉంటుందని ఆయన చెప్పారు. కర్నూలు నగరంలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ప్రకటించారు. హైవే, కాలేజీలు, ఆస్పత్రులు ఉండటంతో ఈ ఆంక్షలు విధించినట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఏస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.
జగన్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు..
కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు వద్ద వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పలు ఫ్లెక్సీలు వెలిశాయి. జగన్ గో బ్యాక్ అంటూ ఆ ఫ్లెక్సీలలో స్పష్టం చేశారు. డీఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ.. వైసీపీ అధినేత జగన్‌ను ఈ ఫ్లెక్సీల ద్వారా సవాల్ విసిరారు. ఎస్సీలపై దాడులు చేసిన వారిని పరామర్శించేందుకు.. రావడానికి సిగ్గుందా? అంటూ ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీకి రా జగన్ అంటూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.