విమర్శలను పట్టించుకోను
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:10 AM
అభివృద్ధి పనులను స్వాగతించకుండా వైసీపీ నాయకులు విమర్శలు చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారని, వారి విమర్శలను పట్టించుకోనని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.
ఆదోని టౌన్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులను స్వాగతించకుండా వైసీపీ నాయకులు విమర్శలు చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారని, వారి విమర్శలను పట్టించుకోనని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. గురువారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 28 మందికి రూ. 12.64 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో రూ. 50 కోట్లతో రహదారుల నిర్మాణం, పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు దానిపై విమర్శలు చేస్తున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పట్టణ అభివృద్ధి విషయంలో తాను తగ్గేదే లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయడమే ధ్యేయంగా కూటమి నాయకులు పని చేస్తున్నారని అన్నారు. జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ, బీజేపీ నాయకులు ఉపేంద్ర కుమార్, సురేష్, ఉషారాజ్, సింహం నాగేంద్ర, న్యాయవాది శ్రీరాములు, దేశాయి చంద్రన్న పాల్గొన్నారు.