గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:08 AM
గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు రూరల్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. నందికొట్కూరు మండలంలోని కొణిదేల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర నుంచి పగిడ్యాల మండలం లక్ష్మాపురం బాట వరకు రూ. 4. కోట్ల అంచనా నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అధికారులు, పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: గ్రామాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. 80బన్నూరు వద్ద జాతీయ రహదారి నుంచి పోతిరెడ్డిపాడు వద్ద చాబోలు గ్రామం వరకు 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులను బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే భూమిపూజ చేసి ప్రారంభించారు. నియోజకవర్గానికి రోడ్లు నిర్మించేం దుకు ఎస్‌ఆర్‌ఆర్‌ఎం నిధుల కింద రూ. 17కోట్లు మంజూరు చేశారని అన్నారు. అందులో 80బన్నూరునుంచి చాబోలు వరకు రూ. 2.53 కోట్లతో 5కిలోమీటర్ల మేర బీటీ రహదారిని నిర్మించేందుకు మంజూరు అయ్యాయని చెప్పారు. అనంతరం పోతులపాడులో రూ.10 లక్షలతో డ్రైనేజీ, రూ. 10లక్షలతో పైపులైను నిర్మాణానికి భూమిపూజ చేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎంపీడీవో గోపికృష్ణ, పీఆర్ డీఈ వీరన్న, ఏఈ బషీర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగేంద్ర, టీడీపీ మండల కన్వీనర్ మోహన్‌రెడ్డి, నాయకులు రవికాంత్, గిరీశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, రవియాదవ్, వేణుగోపాల్‌రెడ్డి, రమణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, సుధాకర్, దొరబాబరెడ్డి పాల్గొన్నారు.
పగిడ్యాల: గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. లక్ష్మాపురం అంచె నుంచి ఘనపురం గ్రామం వరకు 12 కి.మీ. మేర బీటీ రోడ్డు నిర్మాణానికి ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ నిధుల కింద ప్రభుత్వం రూ.1.39 కోట్లు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే బుధవారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. టీడీపీ మండల కన్వీనరు మహేశ్వరరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన నాయకులు చంద్రేష్, షమీన్, అయ్యన్న, మద్దిలేటిగౌడ్, శంకర్, ఉసేన్‌సాహెబ్ , అధికారులు ఉన్నారు.