సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:02 AM
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
కొత్తపల్లి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. గురువారం మండలంలోని పెద్దగుమ్మడాపురం, గిరిజన చెంచుగూడెంలో మండల కన్వీనర్ లింగస్వామి గౌడు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు నాగశేషన్న, శివారెడ్డి ఏర్పాటు చేసిన రెండేళ్ల నమ్మకం... అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. నాగంపల్లి సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ నాయకులు బుచ్చిరెడ్డి, గంగన్న, జడ్.వెంకటరెడ్డి, మల్లయ్య, విజయకుమార్, సుబ్బరాయుడు, గోపాల్, శంకర్, జహరుల్లా, చంద్రారెడ్డి, స్వామిరెడ్డి, సీలం లింగన్న పాల్గొన్నారు.