Share News

శ్రీశైల దేవస్థానానికి విరాళాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:36 PM

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం అమలు చేసే పలు సేవా పథకాలకు భక్తులు విరాళాలు సమర్పించారు.

శ్రీశైల దేవస్థానానికి విరాళాలు
విరాళం అందజేస్తున్న హైదరాబాద్‌ భక్తులు

శ్రీశైలం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం అమలు చేసే పలు సేవా పథకాలకు భక్తులు విరాళాలు సమర్పించారు. బుధవారం హైదరాబాద్‌కు చెందిన కేఆర్‌ సుధారకర్‌రావు దంపతులు అన్నప్రసాద వితరణకు రూ.1,00,001, గోసంరక్షణ పథకానికి రూ.1,00,001, ప్రాణదాన ట్రస్టుకు రూ.1,00,001ల చెక్కును అందజేశారు. అలాగే ఒంగోలుకు చెందిన బి.శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో కలిసి అన్న ప్రసాద వితరణ కోసం 1,00,000 రూపాయల చెక్కును విరాళంగా ఆలయ పర్యవేక్షకుడు శివప్రసాద్‌కు అందజేశారు. దాతలకు దేవస్థానం వారు స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు కల్పించి ప్రసాదాలు, శేషవస్త్రాలతో పాటు రసీదు అందజేశారు.

Updated Date - Nov 11 , 2026 | 11:36 PM