అన్నదాన పథకాలకు విరాళాలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:43 AM
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి భక్తులు బుధవారం విరాళం ఇచ్చారు.
శ్రీశైలం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి భక్తులు బుధవారం విరాళం ఇచ్చారు. రాజమండ్రికి చెందిన ఎం. పోలిరెడ్డి దంపతులు లక్ష రూపాయల చెక్కును ఆలయ పర్యవేక్షకుడు అయ్యన్నకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరపున స్వామిఅమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు, పరిమళ విభూది, శేషవస్త్రాలు, ఙ్ఞాపిక, రసీదును అందజేశారు.
మహానంది: మహానంది క్షేత్రచే నిత్యాన్నదాన పథకానికి నంద్యాలకు చెందిన శివసుందర్‌రెడ్డి రూ.50,116 విరాళం అందచేసినట్లు ఆలయ పర్యవేక్షకుడు పసుపుల సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం దాతలు దేవస్ధానం విరాళాల కౌంటర్‌లో అన్నదాన పధకంకు నగదును విరా ళంగా ఇచ్చారని చెప్పారు. వీరికి స్వామివారి ప్రసాదాలు,బాండును అందచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.