నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:00 AM
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి దాతలు విరాళం ఇచ్చారు.
శ్రీశైలం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి దాతలు విరాళం ఇచ్చారు. బుధవారం కర్నాటక రాష్ట్రం రాయిచూరుకు చెందిన బి. జయపాల్ కుటుంబ సభ్యులతో కలిసి రూ.లక్ష చెక్కును ఆలయ పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు, పరిమళ విభూది, శేషవస్త్రాలు, ఙ్ఞాపికతోపాటు రసీదును అందజేశారు.