Share News

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:40 PM

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు.

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి

ఆదోని, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు. ఆదివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌-2026 శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ గ్రామస్థాయిలో పార్టీని విస్తరించడం, కార్యకర్తల్లో సైద్ధాంతిక అవగాహన పెంచడం, అంత్యోదయ సిద్ధాంతం, సమగ్ర మానవతావాద, సేవాతత్వాన్ని బోధించడం ద్వారా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు వివిధ అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ కార్యకర్త అంకె శ్రీనివాసులు, జిల్లా కార్యకర్త శేషారెడ్డి పాల్గొని పార్టీ క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై ప్రసంగించారు. కార్యక్రమంలో విజయ్‌కృష్ణ, నాగరాజుగౌడ్‌, ఉపేంద్రకుమార్‌, లోకేష్‌కుమార్‌, మాలేకర్‌ శ్రీనివాసులు, కురువ వేణుగోపాల్‌, ఉషారాజు, నాగార్జున, మహాదేవ్‌, బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 11:40 PM