గణేశ్ నిమజ్జనం గ్రాండ్ సక్సెస్.. అధికారులకు మంత్రి టీజీ భరత్ అభినందనలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:53 PM
కర్నూలులో గణేశ్ నిమజ్జనం వేడుకలు విజయవంతంగా ముగియడంతో మున్సిపల్ కౌన్సిల్ హాలులో సక్సెస్ మీట్ నిర్వహించారు.
కర్నూలు, సెప్టెంబర్ 25: జిల్లాలో గణేశ్ నిమజ్జనం వేడుకలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ హాలులో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. గణేశ్ నిమజ్జనం వేడుకలను సమన్వయంతో గ్రాండ్ సక్సెస్ చేసిన అధికారులను మంత్రి టీజీ భరత్ అభినందించారు. వేడుకల నిర్వహణలో అధికారులు, సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం వేడుకలను వైసీపీ నాయకులు రాజకీయ అంశంగా మార్చడం బాధాకరమన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోలేని వారు తన గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. సుంకేసుల డ్యామ్ నీటి నిల్వలపై అవగాహన లేకుండా కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు.
వైసీపీ హయాంలో గుండ్రేవుల ప్రాజెక్టును పట్టించుకోలేదని మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. కనీసం ఒక్క చెక్‌డ్యామ్ కూడా నిర్మించలేదని అన్నారు. త్వరలో నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని తెలిపారు. అలాగే కర్నూలు సీ-క్యాంప్ క్వార్టర్స్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు. ఇటీవలే ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడానని, ఆయన హైకోర్టు న్యాయమూర్తులతో కూడా చర్చించారని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ప్రమాదం
పారిశ్రామికవేత్తలతో లోకేశ్ వరుస భేటీలు.. ఏపీలో ప్రాజెక్టులు పెట్టాలని ఆహ్వానం
Read Latest AP News And Telugu News