కర్నూలులో రూ.76 లక్షల నగదు సీజ్
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:40 AM
కర్నూలు నగరంలో ఓ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి స్నేహితుడి ఇంట్లో పోలీసులు రూ.76 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి స్నేహితుడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు
కర్నూలు క్రైం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో ఓ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి స్నేహితుడి ఇంట్లో పోలీసులు రూ.76 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని 27వ వార్డు కార్పొరేటర్‌గా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మహేశ్వరరెడ్డి స్నేహితుడు డాక్టర్ అమర్‌నాథ్ రెడ్డి ఇంట్లో ఈ నగదును శనివారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది గుర్తించారు. ఈ నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తెలిపారు.
నంద్యాలలో వైసీపీ అభ్యర్థిపై కేసు
నంద్యాల మునిసిపాలిటీ పరిధిలోని 4వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి పురందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పురందర్ తన స్నేహితుడు బోయ వన్నూరుతో కలిసి శనివారం ఓటర్లకు డబ్బు పంచుతుండగా పోలీసులు గుర్తించారు. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రూ.45,510 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నందికొట్కూరులో..
నందికొట్కూరు పట్టణంలో ఓటర్లకు డబ్బు పంచుతుండగా వైసీపీ నేతలు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రత్నస్వామి నుంచి రూ.1.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బైరెడ్డి నగర్‌లోని కోట హైస్కూల్ వద్ద మంజునాథ్ నుంచి రూ.1,01,000 నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!