Share News

చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఎలా ఉంటారో పవన్ నిరూపించారు: ఎమ్మెల్సీ నాగబాబు..

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:02 PM

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరంలో జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లను నాగబాబు పరిశీలించారు.

చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఎలా ఉంటారో పవన్ నిరూపించారు: ఎమ్మెల్సీ నాగబాబు..
MLC Nagababu

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం సోమవరంలో జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లను నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మ్యాజిక్ డ్రైన్లు ఏ విధంగా ఉన్నాయంటూ స్థానిక మహిళలను అడిగారు. ప్రస్తుతం మురుగునీరు రోడ్లపైకి రావడం, దుర్వాసన వంటి సమస్యలు తొలగిపోయాయని ఎమ్మెల్సీకి వారు వివరించారు. ఈ సందర్భంగా డ్రైన్ల ఏర్పాటుకు కృషి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ..'ఆంధ్రప్రదేశ్‌లో మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పవన్ ఆదేశాలతో పైలట్ ప్రాజెక్టు కింద వీటిని నిర్మించారు. మ్యాజిక్ డ్రైన్లతో దోమల బెడద తప్పింది. ప్రజలు రోగాల బారిన పడడం లేదు. భారీ వర్షాల కురిసినా వీటిలో మురుగునీరు నిలవడం లేదు. సాధారణ డ్రైన్ కంటే ఈ మ్యాజిక్ డ్రైన్లు ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ. ఏపీలో రూ.40కోట్లతో 500కిలోమీటర్ల మేర వీటిని నిర్మిస్తాం. ఒక నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయో పవన్ కల్యాణే ఉదాహరణ' అని చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ..

పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులిని సురక్షితంగా బంధించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్

Updated Date - Jun 07 , 2026 | 05:03 PM