Share News

దశాబ్దంగా ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ లేదు: ఈడీ అడ్మిన్‌కు ఉద్యోగ జేఏసీ మెమోరాండం

ABN , Publish Date - Jun 11 , 2026 | 02:49 PM

ఏపీఎస్ఆర్టీసీలో దశాబ్దంగా రిక్రూట్‌మెంట్ జరగడం లేదని సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితోపాటు ఐఆర్, పీఆర్సీ, కొత్త బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని సంస్థ యాజమాన్యానికి ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది.

దశాబ్దంగా ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ లేదు: ఈడీ అడ్మిన్‌కు ఉద్యోగ జేఏసీ మెమోరాండం
APSRTC

విజయవాడ, జూన్11: ఏపీఎస్ఆర్టీసీలో దశాబ్దంగా రిక్రూట్‌మెంట్ జరగడం లేదని సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితోపాటు ఐఆర్, పీఆర్సీ, కొత్త బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని సంస్థ యాజమాన్యానికి ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. గురువారం విజయవాడలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఈడీ అడ్మిన్‌కు సంస్థ ఉద్యోగుల జేఏసీ మెమోరాండం అందజేసింది.


స్త్రీశక్తి కారణంగా వర్క్ లోడ్‌ పెరిగిందని పేర్కొంది. అలాగే బస్ లోడ్ తగ్గించేలా చర్యలు చేపట్టాలని అందజేసిన వినతి పత్రంలో స్పష్టం చేసింది. విలీనం అనంతరం ఈహెచ్ఎస్ వల్ల ప్రయోజనం లేని కారణంగా పాత ఆర్టీసీ మెడికల్ సౌకర్యం కల్పించాలని సంస్థ యాజమాన్యాన్ని కోరింది. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అన్నీ జేఏసీగా ఏర్పాటయిన సంగతి తెలిసిందే.


జూన్ 16 నుంచీ 26వ తేదీ వరకూ ఉద్యమ సమాయత్త సభలు నిర్వహిస్తామని ప్రకటించింది. జూన్ 26, 27 తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసనలు, ధర్నాలు చేపడతామని పేర్కొంది. జూన్ 28వ తేదీ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సంస్థ ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్, షర్మిల.. శవ రాజకీయాలు మానుకోవాలి: పీవీఎన్ మాధవ్

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

For More AP News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 02:59 PM