ఏపీలో పోలింగ్ జోరు.. మధ్యాహ్నం 3 గంటలకు 48 శాతం ఓటింగ్..
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:33 PM
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 48.03 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 96,89,061 మంది ఓటర్లకు గానూ 46,54,133 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 48.03 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 96,89,061 మంది ఓటర్లకు గానూ 46,54,133 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు మున్సిపాలిటీల్లో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనగా, కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలను పరిశీలిస్తే.. కర్నూలు జిల్లా గూడూరు (కె) మున్సిపాలిటీలో అత్యధికంగా 73.96 శాతం పోలింగ్ నమోదైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 73.64 శాతం, కనిగిరిలో 73.20 శాతం ఓటింగ్ నమోదైంది. విశాఖపట్నం (జీవీఎంసీ) పరిధిలో ఓటింగ్ శాతం అత్యల్పంగా 39.74గా రికార్డైంది. ఇక ప్రధాన నగరాలైన విజయవాడలో 41.80 శాతం, గుంటూరులో 40.99 శాతం, నెల్లూరులో 40.91 శాతం, తిరుపతిలో 42.12 శాతం ఓట్లు పోలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో 40.11 శాతం, కడప కార్పొరేషన్లో 41.21 శాతం పోలింగ్ నమోదైంది.
మరోవైపు, మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 43.84 శాతం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 54.28 శాతం, ఆకివీడు నగర పంచాయతీలో 61.94 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 42.12 శాతం, పుత్తూరు మున్సిపాలిటీలో 64.66 శాతం, సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 53.37 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే, నాయుడుపేట మున్సిపాలిటీలో 59.35 శాతం, వెంకటగిరి మున్సిపాలిటీలో 54.77 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 39.74 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గానూ మధ్యాహ్నం 3 గంటల వరకు 7,30,431 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీరిలో 3,58,838 మంది పురుషులు కాగా, 3,71,593 మంది మహిళలు ఉన్నారు. అనకాపల్లి జోన్లో అత్యధికంగా 47.18 శాతం పోలింగ్ నమోదైంది. భీమిలి జోన్లో 44.80 శాతం, గాజువాక జోన్లో 42.28 శాతం పోలింగ్ నమోదైంది. సౌత్ జోన్లో అత్యల్పంగా 34.87 శాతం రికార్డైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష..
పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లుగా రౌడీషీటర్లు.. మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు