Share News

మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. ఏబీఎన్ పిలుపు

ABN , Publish Date - Sep 13 , 2026 | 08:31 PM

రాష్ట్రంలోని వివిధ నగరాల్లో వినాయక చవితి సంబరాల సందడి మొదలైంది. మట్టి గణపతే మహా గణపతి అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిలుపునిచ్చింది.

మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. ఏబీఎన్ పిలుపు

విజయవాడ/నెల్లూరు, సెప్టెంబర్13: రాష్ట్రంలోని వివిధ నగరాల్లో వినాయక చవితి సంబరాల సందడి మొదలైంది. మట్టి గణపతే మహా గణపతి అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇందిరాఫుడ్స్, మండవాస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంయుక్తంగా మట్టి విగ్రహాల పంపిణీ చేస్తోంది. ఆటోలు, ఎడ్ల బండిపై తెచ్చి వివిధ ప్రాంతాల్లో పది వేల మట్టి విగ్రహాల పంపిణీ చేసింది. గతంలో కంటే కొంతవరకు మట్టి గణపయ్యల పూజించాలనే విషయంలో ప్రజల్లో మార్పు వచ్చిందని మండవ వెంకటరత్నం వెల్లడించారు. పూజ కోసం గణపతి విగ్రహంతోపాటు పత్రిని ప్రతి ఏటా ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.


ప్రతి ఒక్కరూ మట్టి గణపయ్యలనే పూజించే విధానం పూర్తిగా రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం సహకరించాలని ప్రజలకు మండవ వెంకటరత్నం విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని.. తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ పిలుపునిచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ సంయుక్తంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.


ఆదివారం దాదాపు 10 వేల మట్టి వినాయక ప్రతిమలను కమిషనర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ నందన్‌తోపాటు సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు, రాజీ యాడ్స్ అధినేత మోపూరు పెంచలయ్య, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్ ఛార్జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదంతో నెల్లూరు నగరంలో గత 15 ఏళ్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సీఎంఆర్ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

వినాయక నిమజ్జనానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు: మంత్రి టీజీ భరత్

మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 08:39 PM