Share News

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. మలుపు వద్ద అదుపుతప్పిన బైక్‌.. యువకుడి మృతి

ABN , Publish Date - Aug 19 , 2026 | 05:55 PM

కళ్లముందే ఎన్నో కలలు.. కుటుంబంపై ఎన్నో ఆశలు.. కానీ ఒక్క క్షణం నిర్లక్ష్యం ఆ యువకుడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఇంటికి చేరకుండానే విగతజీవిగా మారాడు. వివరాల్లోకి వెళితే..

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. మలుపు వద్ద అదుపుతప్పిన బైక్‌.. యువకుడి మృతి
Krishna Road Accident

కృష్ణా, ఆగస్టు 19: ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేస్తున్నా.. కొందరు వాహనదారుల్లో నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు. అతి వేగంగా వాహనాలను నడుపుతూ చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి ప్రమాదమే కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలో చోటుచేసుకుంది. అతివేగంగా బైక్‌ నడిపిన ఓ యువకుడు.. మూలమలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. బైక్‌ అదుపుతప్పడంతో రోడ్డుపై నుంచి పల్టీలు కొడుతూ ఎగిరి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


మృతుడిని దేవరకొండ రాజేష్‌ (21)గా పోలీసులు గుర్తించారు. రాజేష్‌ ఉయ్యూరు నుంచి పామర్రు వైపు బైక్‌పై వెళ్తుండగా మంటాడ సెంటర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మరోసారి అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల జరిగే అనర్థాలను గుర్తుచేస్తోంది. రహదారులపై వేగం కంటే ప్రాణాలే ముఖ్యమని, ముఖ్యంగా మలుపులు, కూడళ్ల వద్ద వాహనాలను అప్రమత్తంగా నడపాల్సిన అవసరం ఉందని ఈ ప్రమాదం హెచ్చరిస్తోంది.


ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

IRCTC అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

Updated Date - Aug 19 , 2026 | 07:14 PM